calender_icon.png 29 December, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీబీఎం స్కూల్ 18వ స్నాతకోత్సవం

29-12-2025 12:14:26 AM

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఐసిబిఎం -స్కూ ల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ (ఐసీబీఎంఎస్‌బీఈ)2023 పిజిడిఎం బ్యాచ్ విద్యార్థు ల కోసం ఆదివారం 18వ స్నాతకోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి (దక్షిణాసియా) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట ర్ సి. రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థు లు వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో వారు అంకితభావం, పట్టుదలతో పని చేసి మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.

గౌరవ అతిథి అడోబ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజిక్ అ కౌంట్ డైరెక్టర్ దీపక్ గార్గ్ హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకు న్న మొత్తం 176 మంది విద్యార్థులకు పట్టా ల ప్రదానం చేశారు. ఐసీబీఎంఎస్‌బీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ షంషుద్దీన్ జరార్, 2023  25 పీజీడీఎం బ్యాచ్‌కు శుభాకాంక్షలు చెప్పా రు. కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ నారాయణరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ డా క్టర్ రీతు జరార్ ప్రొఫెసర్ జితేందర్ గోవిందాని, వి ద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.