calender_icon.png 29 December, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్లాంకెట్, పండ్ల పంపిణీ

29-12-2025 12:11:56 AM

రెనే హాస్పిటల్, మాతా శిశు కేంద్రంలో కార్యక్రమాలు

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డా.బంగారి స్వామి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివాంర రెనే హాస్పిటల్‌లో  స్థానిక మాతా శిశు కేంద్రంలో సుమారు 250 మంది పేషెంట్లకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెనే హాస్పిటల్ లో అతి త్వరలో రోబోటిక్ కీలు మార్పిడి చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని అన్నారు.

కార్యక్రమంలో సీనియర్ గుండె వ్యాధి నిపుణులు డా.సురేష్ కుమార్, క్రిటికల్ కేర్ వైద్యులు డా. కృష్ణా రెడ్డి, పీస్ కమిటీ సభ్యులు యం. ఏ. గఫార్ లయన్, ఫహద్ సిద్ధికి, కాంగ్రెస్ నాయకులు అస్గర్ హుస్సేన్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ తాజ్, నాగరాజులతో పాటు రెనే హాస్పిటల్ నాన్ క్లినికల్ డైరెక్టర్ మేకల అరవింద్ బాబు, లీగల్ అడ్వైజర్స్ సంతోష్ కుమార్, రాజేష్  మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.