calender_icon.png 13 January, 2026 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేదిక మార్చేది లేదు

13-01-2026 12:00:00 AM

బీసీబీకి తేల్చిచెప్పేసిన ఐసీసీ

దుబాయి, జనవరి 12 : టీ20 ప్రపంచకప్‌లో తమ వేదికలను భారత్ నుంచి శ్రీలం కకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ప్రస్తు త పరిస్థుతుల్లో వేదికను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. లాజిస్టిక్స్ ప రంగా చాలా ఇబ్బందులు ఉంటాయని, కావాలంటే మరో రెండు నగరాల్లో ఆడాలని సూచించింది.ఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ జట్టు చెన్నై ,తిరువనంతపురంలో ఆడొచ్చంటూ సూచన చేసింది. దీనిపై బంగ్లా బోర్డు తుది నిర్ణయం తీసుకోవాలని, ఇక తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది.బంగ్లాదేశ్‌లో హిందువువులపై జరుగుతున్న దాడుల కు నిరసనగా ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యలకు దిగింది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు రాలేమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చమని ఐసీసీని కోరింది. అయితే ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్స్ వంటి లాజిస్టిక్స్ అంశాలు ఖరారైపోవడంతో షెడ్యూల్, వేదికలు మారి స్తే తీవ్ర ఇబ్బందులు వస్తాయని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో బీసీబీ ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ భారత్‌కు రాకుంటే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తర్వాత మరోసారి కూడా బీసీబీ లేఖ రాసినా ఐసీసీ వేదికను మార్చే అవకాశం లేదని చెప్పింది. బంగ్లా క్రికెట్ బోర్డు కంటే కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుంది. తమ ప్లేయర్‌కు అవమానం జరిగిందంటూ నానా హంగామా చేస్తోంది. ఐసీసీకి లేఖలు రాయించింది కూడా బంగ్లా ప్రభుత్వమే.