calender_icon.png 14 January, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్సీబీ ధనాధన్

13-01-2026 12:00:00 AM

యూపీకి మరో ఓటమి 

నవీ ముంబై , జనవరి 12: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెం గళూరు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యూపీ వారియర్స్‌పై ఘన విజ యం సాధించింది. యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ,. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది. చేజింగ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. ఓపెనర్లు గ్రీస్ హ్యారిస్ (85), స్మ్రతి మందాన(47) రెచ్చిపోయారు. యూపీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఆర్సీబీ కేవలం పన్నెండు ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. అటు యూపీ వారియర్స్ కు ఇది రెండో ఓటమి.