calender_icon.png 17 January, 2026 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ20 జట్టులోకి శ్రేయాస్ అయ్యర్

17-01-2026 04:17:16 AM

రవి బిష్ణోయ్‌కు పిలుపు

ముంబై , జనవరి 16: టి20 ప్రపంచ కప్ కు ముందు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేసింది న్యూజిలాండ్ తో వచ్చే వారం ఐదు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో మొదటి మూడు టి20 మ్యాచ్ లకు గాయం కారణంగా తిలక్ వర్మ దూరమయ్యాడు.

అతని స్థానంలో ఇటీవల గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఇచ్చింది.  విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న నేపథ్యంలో తీవ్రమైన కడుపునొప్పి బారిన పడ్డ తిలక్ వర్మ.. ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ చేశారు. దీంతో తిలక్ వర్మను 3 టీ ట్వంటీలకు దూరం చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.అటు వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్టోయ్ ని ఎంపిక చేశారు.