calender_icon.png 14 October, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ- సేవ నిర్వాహకుడిపై చర్యల కోసం వినతి

14-10-2025 01:00:00 AM

మందమర్రి, అక్టోబర్ 13 : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని ఈ-సేవ కేంద్రం నిర్వాహకులు ప్రజలను ఇబ్బందుల కు గురిచేస్తున్నారని, వారిపై తక్షణమే చర్య లు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్లు సోమ వారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు పౌర సేవల నిమిత్తం ఈ-సేవ కేంద్రానికి వస్తున్న విద్యార్థులు, యువకులు, వృద్ధులను అవహేళన చేస్తూ, ప్రజలతో దురుసుగా ప్రవర్తి స్తూ, ప్రజలకు తెలియని విషయాల గురించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా, వారిని బెదిరిస్తున్నారన్నారు. సమయపాలన పాటించకుండా ఈ-సేవ కేంద్రం మేనేజర్ ఉపేంద ర్, ఇంచార్జ్ జనార్దన్ ప్రజలను ఇబ్బందుల కు గురి చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమం లో పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, యువ నాయకులు ఆకారం రమేష్, బండి శంకర్, సతీష్, కత్తి రమేష్, సోత్కు ఉదయ్, సీపెల్లి సాగర్, రాయబారపు కిరణ్, చిప్పకుర్తి శశిధర్, మహేష్ పాల్గొన్నారు.