calender_icon.png 14 October, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి కోసం మహిళా ఆత్మహత్యాయత్నం

14-10-2025 01:02:08 AM

కలెక్టరేట్ భవనం ఎక్కిన బాధితురాలు

నిర్మల్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఇం దిరమ్మ ఇల్లు  బిల్లు కోసం కోసం ఓ మహిళ కలెక్టర్ భవనంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర కలకలాని సృష్టించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకు న్న బైంసా మండలం దేగాం గ్రామానికి చెంది న గంగామణి కట్టుకున్న ఇల్లుకు ఇందిరమ్మ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవా రం కలెక్టర్ కార్యాలయం వచ్చింది.

తమ గ్రామంలో తనకు ఇల్లు మంజూరు అయింద ని అధికారులు చెప్పడంతో తాను ఇల్లు కట్టుకున్నానని ఇప్పుడు ఆన్లైన్లో లేకపోవడం వల్ల బిల్లులు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించింది. ఇంటి నిర్మాణం కోసం అప్పులు తెచ్చానని ఇప్పుడు ప్రభుత్వం బిల్లు చెల్లించకపోతే తనకు చావే గతని పేర్కొంది . వెంటనే తనకు న్యాయం న్యాయం చేయాలని కలెక్టర్ భవనం మూడు అంతస్తు పైకి ఎక్కి కూర్చుంది అక్కడి నుండి దూకి చచ్చిపోతానని హెచ్చరించడంతో కలెక్టర్ కార్యాలయంలో తీవ్ర కలకలం రేపింది.

సమాచారం తెలుసుకు న్న అధికారులు పోలీసులు అక్కడ చేరుకొని బాధితురాలు గంగామనితో ఫోన్లో మాట్లాడా రు. తాను అధికారులు చెప్తే తమ స్థలంలో ఇల్లు కట్టుకున్నానని ఇప్పుడు బిల్లు ఇవ్వకుం డా ఏడు నెలలుగా ఇబ్బంది గురి చేస్తున్నారని కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలని విన్నవించిం ది. కలెక్టర్‌తో మాట్లాడిస్తామని అధికారులు చెప్పడంతో కిందికి దిగిన గంగామని కలెక్టర్ ఛాంబర్‌కి వెళ్లి కలెక్టర్‌కు సమస్య వివరించారు.

ఇందిరమ్మ ఇల్లు అనుమతి లేకపోవడం వల్ల బిల్లు రాక లేకపోతుందని తప్పకుండా న్యా యం జరిగేటట్లు చూస్తామని కలెక్టర్ చెప్పిన ఆమె వినిపించుకోలేదు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆమె సమస్యను చెప్పినప్పటికీ తనకు న్యాయం జరగలేదని భావించడమైన కలెక్టర్ ఛాంబర్‌లోని తన వెంట తెచ్చుకున్న చాకుతో చేతిపై ఘాట్లు వేసుకోవడంతో రక్తస్రావమైం ది. వెంటనే కలెక్టర్ వైద్య సిబ్బంది రప్పించి చేతిపై ఉన్న ఘాట్లకు చికిత్స అందించి ఆమెను క్షేమంగా ఇంటికి పంపించాలని పోలీసులకు సూచించారు.