19-09-2025 12:47:41 AM
ఘట్ కేసర్, సెప్టెంబరు 18 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం ఐడియా ట్రానిక్స్ 2కె25 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈసీఈ డీన్ హరికృష్ణ కమతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఐడియా ట్రానిక్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
అనంతరం విద్యార్థులు పోస్టర్, పేపర్ ప్రజెంటేషన్ లో పాల్గొన్నారు. ఈకార్యక్ర మంలో డీన్’ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయ్ కుమార్, అధ్యాపకులు నరేందర్ సింగ్, మనోజ్ కుమార్, ఐడియా ట్రానిక్స్ ప్రోగ్రాం సమన్వయకర్తలు హేమలత పాల్గొన్నారు.