19-09-2025 12:50:42 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి ఘట్ కేసర్ మండల రైతులు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షలో మహిళలు చెరుకుపల్లి చంద్రకళ, కొన్నె మాధవి, యశోజు సుభాషిని, అచ్చటపల్లి ఆశ కూర్చున్నారు.
మహిళా రైతులకు బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొక్క రవీందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, సంఘీభావం తెలియజేశారు.
రైతులకు రుణమాఫీ జరిగే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు జై జవాన్, జై కిసాన్, రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.