calender_icon.png 18 November, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చేస్తే కఠిన చర్యలు

24-07-2024 12:18:08 AM

  • ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలను తొలగించాలి 
  • మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి):  కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 25/1, 25/2 లోని ప్రభుత్వ స్థలంలో విచ్చలవిడిగా వెలసిన అక్రమ కట్టడాలను తొలగించాలని మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మల్కాజిగిరి  ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ ఖాన్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రేణుకాదేవితో కలిసి ఆయా సర్వే నంబర్లలోని ప్రభుత్వ స్థలాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ స్థలాలు ఏ మేరకు ఉన్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా సర్వే నంబర్లలో సుమారు 38 ఎకరాలు హెచ్‌ఎండీఏకు కేటాయించినట్లు, అలాగే  సుమారు 7 ఎకరాలు ఆర్‌జీకే హౌసింగ్ సొసైటీకి అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు త్వరలోనే రక్షణ కంచెను ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.