18-11-2025 04:45:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారతదేశంలో సైబర్ నేరగాళ్లు ఇటీవలే డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భారతదేశ చట్టాలు డిజిటల్ అరెస్ట్ చట్టంలేదని ప్రజలు ఎవరికి భయపడవద్దని ఆమె సూచించారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్త! ఇటీవలి కాలంలో చాలా మంది సైబర్ మోసగాళ్లు పోలీసు/ఇతర అధికారుల పేర్లు చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేసే ఘటనలు పెరుగుతున్నాయి.
చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదు. వీడియో కాల్, వాట్సప్, లేదా ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు మీరు అరెస్టులో ఉన్నారు అని బెదిరిస్తే ప్రజలు అస్సలు నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత, బ్యాంక్, ఓ.టి.పి, యు.పి.ఐ, ఆధార్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే కాల్‌ను స్వీకరించవద్దన్నారు. ఇటువంటి మోసాల నుండి రక్షణ కోసం, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని జిల్లా ఎస్పీ తెలియజేశారు.