calender_icon.png 25 December, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది కొరత ఉంటే మంత్రిని కలవండి

25-12-2025 12:45:06 AM

తిగుల్ పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ హైమావతి

జగదేవపూర్:డిసెంబర్ 24: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి తీగుల్ పి హెచ్ సి వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జగదేవపూర్ మండలం తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా హాస్పటల్ సంబంధిం చిన రికార్డులను, ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి మరమ్మత్తు పనులను పరిశీలించా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పటల్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. హాస్పిటల్ మ రమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్పిటల్ మరమ్మత్తు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే హాస్పిటల్ కి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని రోగుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని వైద్య సిబ్బందికి ఆదేశించారు.

- గ్రామాభివృద్ధికి కృషి చేయాలి 

మహిళ సర్పంచ్ గా గెలవడం సంతోషమని, మహిళ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకరావాలని జిల్లా కలెక్టర్ హైమావతి గ్రామ సర్పంచ్ రజితకు సూచించారు. మహిళగా సర్పంచ్ గెలవడం సంతోషామని, గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. హాస్పిటల్ లో పారిశుధ్య నిర్మూలన చర్యలు తీసుకోవాలని కోరారు. 

మంత్రి దృష్టికి తీసుకెళ్లండి

తిగుల్ ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు బట్టు దయానంద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హైమావతి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వైద్య సిబ్బంది కొరత ఉంటే సంబంధిత రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకపోవాలని చెప్పారు. అనంతరం దయానంద్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత గల జిల్లా కలెక్టర్ ఇలా సమాధానం ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యుడు రాజశేఖర్, సర్పంచ్ రజిత పరశురామ్, వైద్య సిబ్బంది నారాయణ, నీరజ, గ్రామ నాయకులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.