calender_icon.png 27 October, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం గెలిస్తే వేతనాలు రెట్టింపు చేస్తాం

27-10-2025 01:07:38 AM

  1. బీహార్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ 
  2. పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధులకు హామీ

పట్నా, అక్టోబర్ 26: బీహార్ ఎన్నికల్లో మేం గెలిస్తే బీహార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ, గ్రామ కోర్టుల ప్రతినిధుల వేతనాలను రెట్టింపు చేస్తామని ఇండియా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అన్నారు. ఈ కీలక ప్రకటన ఆదివారం చేసి బీహార్ ఓటర్లను ఆయన ఆకట్టుకున్నారు. అంతేకాదు వారికి పెన్షన్, రూ.50 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు.

నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. ఆయనకు ప్రజలు 20 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శిం చారు. తమ ప్రభుత్వం వచ్చిన 20 నెలలలోనే బీహార్‌ను అభివృద్ధిలో నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు.

ఎన్డీఏ నాయకులు మహాగఠ్‌బంధన్‌లో చీలికలు ఏర్పడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. వీఐపీ వ్యవస్థాపకుడు, డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్ సహనీ తానూ కలిసే ప్రచారం చేస్తున్నామని, త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. చేతివృత్తులపై బతుకుతున్న వారికి రూ.5లక్షల వడ్డీలేని రుణాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు.