calender_icon.png 27 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో స్లీపర్ బస్సులో మంటలు

27-10-2025 01:06:13 AM

  1. ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై రెవ్రి టోల్‌ప్లాజా వద్ద ఘటన
  2. 39 మంది ప్రయాణికులు సురక్షితం

ఢిల్లీ, అక్టోబర్ 26: ఏపీలోని కర్నూలులో బస్సు బుగ్గి ఉదంతం మరువక ముందే ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై మరో ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్ బస్సులో రెవ్రి టోల్ ప్లాజా సమీపంలో ఆదివారం తెల్లవారుజమున అకస్మాత్తు గా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

డ్రైవర్ అప్రమత్తమై బస్సులో ఉన్న దాదాపు 39 మంది ప్రయాణికులను కిందకు దించడంతో పెద్ద ప్రమా దం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘట నా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తొలుత బస్సు చక్రానికి అంటు కున్న మంటలు క్రమంగా వాహనంలోని మిగిలిన భాగాలకు వ్యాపించినట్లు డ్రైవర్ జగత్ సింగ్ తెలిపాడు. బస్సు ప్రమాదం కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.