calender_icon.png 18 August, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

14-08-2025 01:37:25 AM

లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

మిడ్జిల్ ఆగస్టు 13 : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు, బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎలాంటి అర్హుడు పథకాలకు దూరం కాకుండా చూడటం తమ బాధ్యత అని అన్నారు.

నూతన రేషన్ కార్డుల ద్వారా మరింత మంది కుటుంబాలు అండగా ఉండే విధంగా సంక్షేమం అందుతుందని తెలిపారు.భవిష్యత్తులో కూడా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు, గత ప్రభుత్వంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని వారు మండిపడ్డారు. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు ఇది పెద్ద కుటుంబానికి భరోసా, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.

మిడ్జిల్ నుంచి కొత్తపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు కావడంతో పాటు పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు వాడియాల వేముల మసిగులపల్లి చెన్నంపల్లి వరకు డబల్ రోడ్డు , రాణిపేట్ నుండి సింగం దొడ్డి, వరకు డబల్ రోడ్డు నూతనంగా మంజూరు చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అలవాల్ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి రబ్బాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వాతి, తహసిల్దార్ పులి రాజు, ఎంపీడీవో గీతాంజలి, ప్రజా ప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ గౌస్, సాయిలు, మల్లికార్జున్ రెడ్డి, వెంకటయ్య, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.