24-07-2025 12:29:53 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 23 (విజయ క్రాంతి) : ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తున్న ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని మంచి పనులు చేస్తే మీకే పేరు వస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి మాట్లాడారు.
ఎన్నికల్లో ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి, 10 శాతం ఉన్న పనులను అస్సలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ది మన సొంత జిల్లా అని చెప్పుకునేందుకు నాకు కూడా సంతోషంగా ఉందని, మన జిల్లా అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో కష్టాలు పడి సరాష్ట్ర సాధన కోసం శ్రమించామని, అభివృద్ధి చేయకుండా ఆరోపణలు చేస్తామంటే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు సాగాలని, బిజెపి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపాలని కోరారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మించేందుకుగాను రూ 290 కోట్లతో జీవోను విడుదల చేయడం జరిగిందని వెంటనే టెండర్లు పిలిచి అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించాలన్నారు.
చేసిన పనులకే శంకుస్థాపనలు చేస్తే ఫలితం ఏముంటుందని ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్ పై ఆరోపణలు చేస్తే అభివృద్ధి జరగదని అడుగులు వేస్తూ అభివృద్ధి చేస్తేనే ప్రజల మండల లో ఉంటాయని సమయం చాలా తక్కువగా ఉందనే విషయాన్ని నేతలు గమనించాలన్నారు.
అంతకుముందు పార్టీ కార్యకర్తలతో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్, తదితరులు ఉన్నారు.