calender_icon.png 24 May, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగాలి

23-05-2025 05:59:41 PM

బైంసా,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత కష్టపడి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం బైంసా పట్టణంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సందర్శించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు చదువుకోవడం వలన సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు పేద పిల్లలకు సులభైరమైన పద్ధతిలో విద్యాబోధన నిర్వహించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉపాధ్యాయులు ఉన్నారు.