23-05-2025 06:03:44 PM
సింగరేణి ఏరియా జీఎం దేవేందర్
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వార నూతనంగా ఉద్యోగం పొందిన యువ కార్మికులు కష్టపడి అంకితభావంతో ఎదురు నిర్వహించి ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ కోరారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడికల్ ఇన్ వాలిడేషన్ ద్వార నూతనంగా ఉద్యోగం పొందిన 11 మంది వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వార 1985 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు, సమయాలు భిన్నంగా ఉంటాయన్నారు. నూతన ఉద్యోగులు విధులకు తరచూ గైర్హాజరు అయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని యువ కార్మికులు సక్రమంగా విధులకు హాజరై, కష్టించి పనిచేసి సంస్థ అబివృద్దికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్, డివైపిఎం సత్య బోస్, ఆఫీస్ సూప రింటెండెంట్ రాయలింగు లు పాల్గొన్నారు.