calender_icon.png 24 May, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తనాల షాపుల్లో తనిఖీలు

23-05-2025 06:16:32 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల విక్రయ షాపుల్లో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, షాపుల్లో ఉన్న విత్తనాలను, నాణ్యతను, పిఓ సర్టిఫికెట్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, కచ్చితంగా విక్రయించిన విత్తనాలకు బిల్లులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎస్సై చిర్ర రమేష్ బాబు, పిఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.