23-05-2025 05:56:32 PM
ఇబ్రహీంపట్నం: అనుమానస్పద స్థితిలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన నాగిరెడ్డి (32), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధి మంగల్ పల్లిలోని భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అయితే నాగిరెడ్డి అదే భారత్ కాలేజీలో పనిచేసే శివకృష్ణారెడ్డి అనే వ్యక్తితో కలిసి సుప్రియ హాస్టల్ లో ఒకే రూమ్ లో ఉండేవారు.
కాగా సుప్రియ హాస్టల్ లో శుక్రవారం నాగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో రూమ్ లో చనిపోయి ఉన్నాడు. దీంతో సమాచారం అందుకున్న మృతుడి బావమరిది వెంకటకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా నాగిరెడ్డి మూడు నెలలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడని, గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి వివరాలు పోస్టుమార్టం నీవేదిక అనంతరం పూర్తిగా వెల్లడిస్తామని సీఐ తెలిపారు. బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.