calender_icon.png 1 August, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా అనుకుంటే జీఎస్టీ కట్టండి

20-07-2024 12:24:08 AM

కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అంచనాలకు చేరుకోలేకపోతున్నాయని కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి పేర్కొన్నారు. తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉండాలని కోరుకుంటే, ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని పాలించకూడదనుకుంటే, పౌరులు విధిగా జీఎస్టీని చెల్లించాలన్నారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టీఎఫ్‌సీసీఐ) ఆధ్వర్యంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖతో కలిసి ఫెడరేషన్ హౌస్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు, తయారీదారులకు ప్రయోజనాలు అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

స్పెషల్ డ్రైవ్ కింద జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో జీఎస్టీ ఏడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంద న్నారు. తాము రాష్ట్ర ఖజానాకు చట్టబద్ధమైన ఆదాయాన్ని కోరుకుంటున్నామని, ఇందుకు వ్యాపారులు సహకరించాలన్నారు. తాము చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాను ఆరు నెలల క్రితం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించానని, అప్పట్లో పన్ను వసూలు 68శాతం ఉండేదని, అది ఇప్పుడు 82శాతానికి పెరిగిందన్నారు. నిరంతర పర్యవేక్షణ కారణంగా తాము ఆ వృద్ధిని సాధించామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 90శాతం పన్ను వసూళ్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.