calender_icon.png 26 December, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్

26-12-2025 02:10:15 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) :యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు తమ సొంతం అవుతుందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఉన్నారు. ఘట్ కేసర్ గురుకుల్ కళాశాల మైదానంలో మల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులను క్రీడల వైపు ప్రోత్సహించేందుకే ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తన వైవాహిక జీవితానికి మార్చి 19న 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల కోసం భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, రైతు సొసైటీ మాజీ చైర్మన్ సార శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, బేతాళ నర్సింగరావు, నాయకులు ఎంపాల సుధాకర్ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, లింగస్వామి,పల్లె విజయ్ గౌడ్, సార శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.