calender_icon.png 26 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధులు ప్రకటించడం అభినందనీయం

26-12-2025 02:13:44 AM

మొయినాబాద్, డిసెంబర్ 25(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గెలుపొందిన సర్పంచ్లకు గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం ప్రకటించడం అభినందనీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామాన్ని ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు కేక్ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా కలిసి ఉన్నప్పుడే సంతోషంగా పండుగలు జరుపుకుంటామని తెలిపారు గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్ అందరికీ నిధులు ప్రకటించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు 10 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు.

గడిచిన టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు కొత్తగా ఏర్పడి సర్పంచ్లు బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రామాల మెయింటెనెన్స్ అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామని తెలపడం ఆదర్శనీయమని ప్రకటించారు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత సర్పంచి పాలకవర్గానిదేనని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు గ్రామాలలో ముఖ్యంగా యువత సర్పంచులు అధికంగా గెల్పొందారని యువతతో కలిసి ప్రజాప్రతినిధులు అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన కోరారు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.