26-05-2025 10:06:15 PM
కేంద్ర పరిశ్రమలు శాఖ మంత్రి జితన్ రామ్ మాంజీ
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దేశంలో మహిళా పారిశ్రామిక వేత్తల(Women Entrepreneurs) అభ్యున్నతికీ భారత ప్రభుత్వం(India Government) చేయూతనిస్తుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంజీ(Union Minister Jitan Ram Manjhi) అన్నారు. గాజులరామారం మిథిలానగర్ లో గల ఎలీఫ్ ఇండస్ట్రీస్(Alif Industries) ఆధ్వర్యంలో సోమవారం ఉద్యమి నుంచి ఉన్నతి -వికసిత్ భారత్ కోసం మహిళా పారిశ్రామిక వేత్తలతో భవిష్యత్ నిర్మాణం అనే అంశం పై జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళా అంకుర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను కేంద్ర మంత్రి పరిశీలించారు.
పలువురు చేసిన పర్యావరణ హిత ఉత్పత్తులను మంత్రి తిలకించి ఆయా ఉత్పత్తుల పనితీరు, చేసిన విధానాలను తెలుసుకుని మహిళా ఎంటర్ప్రైనర్ లను అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ప్రపంచ సవాళ్లను తెలుసుకుని వాటికీ అనుగుణంగా ఎదుగుతూ ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎలీఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ రమాదేవి( Elif Industries Chairperson Ramadevi) నూతన మహిళా ఎంటర్ప్రైనర్స్ ను ఉత్పత్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు.
ఇన్నోవేషన్ సుస్థిరతపై ప్రేరణాత్మక షేషన్స్, మహిళా పారిశ్రామిక వేత్తల విజయ గాథలు,సమగ్ర గ్రీన్ ఇండస్ట్రియల్ అభివృద్ధిపై చర్చలు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, ఔత్సాహిక వాతావరణంలో ఎలీఫ్ పాత్ర అనే అంశాలపై చర్చను సాగించారు. ఈ కార్యక్రమంలో పీఎం విశ్వకర్మ ఎం ఎస్ ఎం ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మిలింద్ ధర్మారావు రాంటికే, సూచ్మ, చిన్న, మధ్య తరహా మంత్రిత్వ శాఖ సంయుక్త సంచాలకులు మెర్సీ ఏపావో తదితరులు పాల్గొన్నారు.