07-08-2025 12:24:43 AM
చొప్పదండి, ఆగస్టు 6 (విజయ క్రాంతి): మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి మరోసా రి తన దాతృత్వాన్ని చాటుకున్నా రు. ఇటీవల గాయాలపాలైన బాధితులను పరామర్శించి... ఆర్థికసాయం చేశారు. బాదితులకు ఎల్లవేలలా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
గత కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యయత్నానికి పాల్పడి గాయలపాలైన గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ విజయలక్ష్మీ భర్త రవిని పరామర్శించారు. బాధితుడి కుటుంబీకులతో మా ట్లాడి... ఖర్చుల నిమిత్తం 30వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ గౌడ్ ఇటీవల తాటిచెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయపడగా జయపాల్ రెడ్డి పరామర్శించి... 20వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులుపాల్గొన్నారు.