calender_icon.png 16 September, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రుపాలెం మండలంలో అక్రమ మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలి: సీపీఎం

16-09-2025 12:25:03 AM

ఎర్రుపాలెం, సెప్టెంబర్ 15 ( విజయ క్రాంతి):ఎర్రుపాలెం మండలంలో అక్రమ మట్టి మైనింగ్ మాఫియాలను అరికట్టాలని సోమవారం నాడు మండల సిపిఎం బృందం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ప్రకృతి సంపదను ధ్వసం చేస్తూ అక్రమంగా మైనింగ్ చేసే మట్టి మాఫియా ఆగడాలను అరికట్టి అట్టి వారిపై చర్యలు చేపట్టాలని గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర రావు జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు నాయకుల తో కలిసి సోమవారం వినతి పత్రాన్ని అందించారు.

ఎరుపాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గల మట్టి గుట్టలను క్వారీ లు గా ఏర్పాటుచేసి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమoగా తరలిస్తూ లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడు తూ దోచుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. వందలాది వాహనాల ద్వారా వాహన కెపాసిటీకి మించి అధిక లోడులతో మట్టిని తరలిస్తూ రోడ్లను సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణా లోని వివిధ ప్రాంతాలకు,ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున రేయి పగలు అనే తేడా లేకుండా గ్రావెల్ ను అధిక స్పీడుతో తరలిస్తూ ప్రజల ప్రాణాలకు భయభ్రాంతులు కల్పిస్తున్నారని స్థానిక ప్రజలకు దుమ్ము,ధూళి,ధ్వని వాయు కాలుష్యాలను వ్యాపిం పజేస్తున్నారు.

పొలాలలో పండే పంటలకు నష్టం కల్పిస్తూ దిగుబడి తగ్గే విధంగా వాహనాలను రవాణా చేస్తున్నారు. భవిష్యత్తు ప్రకృతి వైపరీత్యాలకు కారకులై ప్రభుత్వ ఆదాయానికి గండి కొ డుతున్న అక్రమ తవ్వకాల గురించి పలుమార్లు స్థానిక తహసిల్దార్ దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి చర్యలు చేపట్టకుండా వారికి సహకరిస్తున్నారు.కావున తమరు స్వయంగా సందర్శించి అక్రమ గ్రావెల్ తోలకాలను అరికట్ట గలరని,సంబంధిత శాఖల అధికారులతో తనిఖీ చేయించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమలో గొల్లపూడి పెడ్డకోటేశ్వరావు,నల్లబోతుల హనుమంతరావు, నాగులవంచ వెంకట రామయ్య, తల్లపురెడ్డి సీతారమిరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.