14-11-2025 12:07:07 AM
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్ ‘జిగ్రీస్’. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్భంగా సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమా చేయడానికి యూనిట్ అందరికీ ఒక పిచ్చి కావాలి. సినిమా మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. సెన్సార్, ప్రివ్యూ రిపోర్ట్స్ జనరల్ చాలా జెన్యూన్‌గా అనిపించింది. ఆ ఆదరణ థియేటర్లలో కూడా లభించాలని కోరుకుంటున్నా. చాలా పిచ్చితో కష్టపడి తీశారు. ‘అర్జున్‌రెడ్డి’ నేను ఎలా తీశానో అంతకంటే ఎక్స్‌ట్రీమ్‌గా తీశారు.
దానికోసం అయినా సినిమా బాగా ఆడాలి. హీరో డైరెక్టర్‌తో సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లి చూస్తారు. అది మన తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ. ఈ సినిమా కూడా థియేటర్స్లోకి వెళ్లి చూడాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాక్టర్స్ కృష్ణ బురుగుల, ధీరజ్, మణి, డైరెక్టర్ హరీశ్‌రెడ్డి, ప్రొడ్యూసర్ కృష్ణ, చిత్రబృందం పాల్గొన్నారు.