calender_icon.png 16 September, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపడను.. న్యాయపరంగా ఎదుర్కుంటా

16-09-2025 12:59:13 AM

  1. డ్రగ్స్ తీసుకోలేదని ముందుకు వచ్చే ధైర్యం కేటీఆర్‌కు ఉందా?
  2. కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావాపై భయపడనని, న్యాయపరంగా ఎదుర్కుంటానని చెప్పారు. అయితే డ్రగ్స్ తీసుకోలేదని ముందుకు వచ్చే ధైర్యం కేటీఆర్‌కు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.

సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తనపై పరువు నష్టం దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని, దాని కి తాను భయపడనని, న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. గతంలోనే తొమ్మి దిసార్లు జైలుకు వెళ్లి వచ్చానని, వందకు పైగా కేసులు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ మాదిరిగా తాను పరువు నష్టం దావా వేయాలంటే అ నేక కేసులు వే యవచ్చని,  తాను రాజకీయంగా ఎదుర్కొంటానని, బెదిరించేం దుకు పరువు న ష్టం దావా వేయనని స్పష్టం చేశారు.

తాను లవంగం తింటే తంబాకు అన్నారని.. నిరూపించడానికి ద మ్ముంటే కుటుంబ సభ్యులతో దేవుడు సన్నిధికి రావాలని కేటీఆర్‌కు సవాల్ చేస్తే ఎం దుకు రావడం లేదని ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్ ఎవరెవరికి ట్వీట్ చేశాడో త్వర లో అన్ని ఆధారాలతో బయటపెడతానని తెలిపారు.

సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించడని నిలదీశారు. కాగా తెలంగాణకు కేంద్రం 12 లక్షల టన్నుల యూరియా సప్లై చేసిందని, కేవలం 9 లక్షల యూరియా మాత్రమే పంపిణీ చేశారని కాం గ్రెస్ ప్రభుత్వం చెపుతున్నదని అన్నారు. మి గతా మూడు లక్షలు బ్లాక్ మార్కెట్ చేశారని ఆరోపించారు.