calender_icon.png 16 September, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

16-09-2025 12:58:00 AM

-వినూత్నంగా ఆలోచించే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్

-విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు

-వర్సిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజినీర్స్‌డే వేడుకలు

హైదాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి)ఃదేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఇంజినీరింగ్ విద్యార్థులంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని సరికొత్త టెక్నాలజీలను ఆవిష్కరిచాలని, అప్పుడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కన్న కలలు, ఆశయాలు సాకారమవుతాయ ని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు అన్నారు.అలాగే సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే వినూత్న ఆలో చనలు చేసే ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.

  సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ప్రఖ్యాత ఇంజినీరు, భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వే శ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇం జినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా వర్సిటీ డైరెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ సివిల్, మెకానికల్, ఎల క్ట్రికికల్, రవాణా రంగం, తయారీ రంగం, వ్యవసాయం, ఆటో మొబైల్.. ఇలా ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పా త్రే ఎక్కువుగా ఉంటుందన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థి వారికొచ్చే ఆలోచనలలో ఒక్కటైనా ఆచరణలోకి తీసుకురాగలితే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. విద్యార్థులందరూ వారి ఆలోచనలను స్టార్టప్స్‌గానో, కంపెనీలతో అసోసియేట్ అవ్వడమో చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. భారతీయ ఇంజినీరింగ్ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకుంటే ప్రపంచ దేశాలను శాసించే సదావకాశం మన ముంగిట ఉంటుందన్నా రు. విద్యార్థులు నిరంతరం కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండాలన్నారు. ఇరిగేషన్ బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్థమైన నీటిని నిల్వచేసి తిరిగి ఉప యోగించే విధంగా విశ్వేశ్వరయ్య కృషి చేశారని కొనియాడారు.

విశ్వేశ్వరయ్య సివిల్ ఇం జినీరుగా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాముల నిర్మాతగా, స్టేట్స్‌మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దేశాభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లను కనుగొన్నది ఆయనేనని, ఆ గేట్లు ఇరిగేషన్ వ్యవస్థలో పెను విప్లవంగా నిలిచాయన్నారు. ఇప్పటికీ ఇదే పరిజ్ఞానాన్ని జలాశయాల నిర్మాణంలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తన ఆలోచనలతో దేశానికి ఎంతో సేవ చేశారని, నీటి పారుదల వ్యవస్థలో దేశానికి తిరుగులేని పరిజ్ఞానాన్ని అందించారని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని మనదేశంతో పాటు శ్రీలంక, టాంజానియా దేశాలు కూడా ఈరోజును ఇంజినీర్స్‌డేగా జరుపుకుంటారని తెలియజేశారు.

ఆకట్టుకున్న ప్రాజెక్ట్ ఎక్స్‌పో 

ఇంజినీర్స్‌డేను పురస్కరించుకుని వర్సిటీలో ప్రాజెక్ట్ ఎక్స్‌పోను న్విహించారు. వి ద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల వి నూత్న ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు ఆకట్టుకున్నాయి. అత్యుత్తమంగా రూపొందించిన ప్రాజెక్లులకు బహుమతులను అందజేశారు. అలాగే విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.