calender_icon.png 7 May, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్యపై తక్షణమే స్పందించాలి

07-05-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే 6(విజయక్రాంతి): త్రాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో మిషన్ భగీరథ ఇంజనీర్లు, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో  త్రాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి సమస్యలపై దినపత్రికలలో, ప్రసార సాధనాలలో వచ్చిన కథనాలపై అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి మండలంలో బుధవారం రోజున మిషన్ భగీరథ ఇంజనీర్లు, పంచాయితీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ సిబ్బందితో త్రాగునీటిపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమీక్ష నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని 147 హాబి టేషన్ లలోని త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రత్యామ్నా ఏర్పాట్లను అన్వేషించా లన్నారు.

మిషన్ భగీరథ మోటార్లు, పైపు లైన్ల లీకేజీ మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, గ్రామాలు, మున్సిపా లిటీలలో నీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. త్రాగునీటిపై ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శి తన పరిధిలో  ప్రతి రోజు గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న వివరాలు ప్రతిరోజు అందించాలని ఆదేశించారు.

సమీక్షించాలని, చలివేంద్‌ఈ కార్యక్ర మంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, మిషన్ భగీరథ ఈ. ఈ. సిద్ధిఖి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లాలో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, లబ్ధిదారుల జాబితాలపై హౌసింగ్ పీడీ, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పైలట్ గ్రామాలలో ఎంపిక చేసిన లబ్ధిదారులు తమ ఇండ్ల పనులను ప్రారంభించే విధంగా ఇంజనీర్లు చర్యలు తీసుకోవా లని, బేస్ మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారుడి వివరాలు నమోదు చేసి మొదటి విడత నిధులు అందించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పనులలో వేగం పెంచాలన్నారు.

లబ్ధిజాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని, అనర్హుల వివరాలు ఉన్నట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై సమగ్ర పరిశీలన జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. వేణుగోపాల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.