07-05-2025 12:00:00 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్, మే 6 (విజయక్రాంతి): జిల్లాలో అరులైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా లోని చొప్పదండి, వేములవాడ, కోరుట్ల నియోజకవర్గం లో గ్రామాల వారిగా ఇందిరమ్మ గృహాలకు అరత కలిగిన దరఖాస్తుదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గృహాల మంజూరి కోసం వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు సంబంధిత మండల అధికారులకు సూచించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు సూచించిన అరులైన దరఖాస్తు దారులను విచారించి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించాలన్నారు. అనరులకు ఎట్టి పరిస్థితిలో లబ్ధి చేకూరకుండా జాగ్రత్తలు పాటించి ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, మండల అధికారులు పాల్గొన్నారు.