calender_icon.png 2 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనైతిక రాజకీయాలు తగవు

02-12-2025 12:28:41 AM

  1. బీఆర్‌ఎస్ కూటమి గూండాగిరి చేశారు 
  2. నామినేషన్లు స్కూటీని జరిగే సమయంలో కేంద్రం వద్ద పోలీసులు లేకపోవడం దురదృష్టకరం
  3. పంచాయతీ ఎన్నికల నియమావళి పట్ల అవగాహన లేని ఆర్వో 
  4. ఈ అంశంపై ఎన్నికల ఉన్నతాధికారులు విచారణ చెయ్యాలి
  5. ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉంది 
  6. బీజేపీ కూటమి ఖచ్చితంగా సర్పంచ్ బరిలో ఉంటుంది 
  7. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ కూటమి నేతలు

భద్రాచలం, డిసెంబర్ 1, (విజయక్రాం తి): భద్రాచలం పట్టణంలో అనైతిక రాజకీయాలు తగవని , బిఆర్‌ఎస్, సిపిఎం కూట మి నేతలు నామినేషన్ కేంద్రంలోకి మూకుమ్మడిగా వచ్చి ఆర్‌ఓపై గూండాగిరి చేశారని బిజెపి కూటమినేతలు ఆరోపించా రు. సోమవారం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల టిడిపి కార్యాలయంలో కూటమినేతలు పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... బిఆర్‌ఎస్ పార్టీ, వామపక్ష పార్టీలైన సిపిఐ (ఎం )నాయకులు మూకుమ్మడిగా నామినేషన్ కేంద్రంలోకి తరలి వెళ్లి ఎన్నికల అధికారి ( ఆర్వో )ను భయభ్రాంతులకు గురి చేశారని, ఆ సమయంలో అక్కడ పోలీసులు పహారా కాయకపోవడం శోచనీయమన్నా రు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి నా మినేషన్ కేంద్రంలోకి వెళ్లి ఎన్నికల అధికారి వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని పరిశీలించడానికి ప్రయత్నించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, పంచాయతీరాజ్ చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల అధికారులు కూడా చిత్తశుద్ధిగా వి ధులు నిర్వహించలేదని, ఆర్వోగా విధులు ని ర్వహించిన అధికారికి కనీసం ఎన్నికల నియమావళి పై అవగాహన లేదన్నారు. నామినే షన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ఎన్నికల అధికారిని భయభ్రాంతుల కు గురిచేసి బిజెపి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు ప్రత్యర్థి బిఆర్‌ఎస్ కూటమి ప్రయత్నించారని, దీనిని పిరికిపంద చర్యగా పరిగణిస్తున్నామన్నారు.

కమ్యూనిస్టులకు బలంలేక పొత్తులు పెట్టుకుని, ప్రత్యర్థి పార్టీలో బలమైన వ్యక్తి నిలుచుంటే ఓటమి కాయమేనన్న భయంతో వింత చేష్టలకు పాల్పడుతున్నారన్నారు. కమ్యూనిస్టు పార్టీ లు, బిఆర్‌ఎస్ పార్టీ భద్రాచలానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజాక్షేత్రంలో వివరించాలన్నారు. నామినేషన్ పత్రంలో బిజెపి అభ్యర్థి అన్ని వివరాలను అర్థవంతంగా లిఖించారని, ఆస్తుల వివరాల సరిపోయి ఖాళీ పేజీలో లేనందున, ఇతర పేజీలో పూరించామని, ఆ పేజీని జత చేస్తున్నామని వివరంగా రాశామని, ఇది చూడని ఆర్వో కనీసం సమాచారం లేకుండా అభ్యర్థిత్వాన్ని నిరాకరించారని మండిపడ్డారు.

ఈ విషయంపై సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అప్పి లు (నెం. 1/25)గా దాఖలు చేశామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పై మాకు నమ్మకం ఉందని, మా అభివృద్ధిత్వాన్ని పరిశీలించి సబ్ కలెక్టర్ అభ్యర్థిత్వాన్ని అంగీకరి స్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా బిజెపి పార్టీ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల బరిలో ఉం టారని, లేనియెడల ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

సామాజిక సేవా తత్పురుడు అయిన బిజెపి కూటమి అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ ని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి భద్రాది కొత్తగూ డెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భద్రాచలం బిజెపి కూటమి సర్పంచ్ అభ్యర్థి బి. హరిశ్చంద్ర నాయక్, టిడిపి నాయకులు కొడాలి శ్రీనివాస్, కుంచాల రాజారాం, తాళ్లూరి చిట్టిబాబు, అభినేని శ్రీనివాస్, బిజె పి నాయకులు కుంజా ధర్మ, కురిచేటి రామచంద్రమూర్తి, పసుమర్తి సతీష్, ములిశెట్టి రామ్మోహన్రావు, నిడదవోలు నాగబాబు, ముత్యాల శ్రీను, జనసేన పార్టీ నాయకురాలు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.