calender_icon.png 2 December, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.330 కోట్లకు కుచ్చు టోపీ

02-12-2025 01:35:52 AM

  1. అధిక వడ్డీ ఆశ చూపి మోసం

నల్లగొండలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ 

లీగల్ అడ్వైజర్, డైరెక్టర్ ఇంటి ఎదుట బాధితుల ధర్నా

నిందితులిద్దరూ భార్యాభర్తలే

నల్లగొండ క్రైమ్, డిసెంబర్ 1: అధిక వడ్డీ ఆశచూపి, ప్రజల నుంచి రూ.330 కోట్లు వసూలు చేసి ఓ ఫైనాన్స్ సంస్థ కుచ్చు టోపీ పెట్టిన ఘటన నల్లగొండలో జరిగింది. బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ లీగల్ అడ్వైజర్ డైరెక్టర్ ఇంటి ఎదుట బా ధితులు సోమవారం ధర్నా చేశా రు. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీ హను మాన్ టెంపుల్ సమీపంలో ఉండే రాపోలు ప్రకాష్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా, ఆయన భార్య సోమేశ్వరి డైరెక్టర్‌గా ఉన్నారు.

హైదరాబాదులోని మి యాపూర్‌లో ఈ ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశారని, దానికి 12 మం ది డైరెక్టర్లను నియమించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామని ప్రజలను నమ్మించారు. రూ.100కు రూ.4 వడ్డీ చొప్పున చెల్లిస్తామని నమ్మించి నల్లగొండకు చెందిన దా దాపు 300 మంది నుంచి సుమారు రూ.330 కోట్ల వరకు వసూలు చేశారు. ఆ డబ్బులు తీసుకుని నిందితులు ఉడాయించారు.

గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న రాపోలు ప్రకాష్, ఆయన భార్య సోమేశ్వరి సోమవారం నల్లగొండలోని నివాసానికి వచ్చినట్లు తెలియడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు వెళ్లి ధర్నా చేశారు. నల్లగొండ టూ టౌన్ పోలీసులు నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి బాధితుల సమస్యను విన్నారు. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమగ్రంగా విచారించి తగిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ ఎస్‌ఐ సైదులు తెలిపారు.