02-12-2025 01:37:08 AM
-రిటైర్డ్ ఉద్యోగులు రూ.౧,౫౦౦ కోట్లు విడుదల చేయాలి
-డీఏలు, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి
-ఇచ్చిన హామీలు ఈ నెల లోగా అమలు చేయాలి
-ఉద్యోగుల జేఏసీ నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రూ.1,500 కోట్లు విడుదల చే యాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల పెండింగ్ బిల్లులను ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ, వాస్తవ అవసరం 1,500 కోట్లుపైగానే ఉందన్నారు.
రాష్ర్టంలో నెల కు సగటున 600 మంది ఉద్యోగులు రిటై ర్డ్ అవుతుండటంతో వారి బకాయిలకు మ రో రూ.700 కోట్లు అవసరం ఉంటుందన్నారు. ఇక మీదట రూ.700 కోట్లు విడు దల చేయకుండా రెండు కలిపి రూ.1500 కోట్లు విడుదల చేయాలని ఉద్యోగుల జేఏ సీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు.నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో సోమవారం జేఏసీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడా రు.
ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయా లని జేఏసీ నేతలు కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను డిసెంబర్ 9లోగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన సంబురాలు ఈ నెల 8, 9 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్ డీఏలు, ఉద్యోగుల హెల్త్ కార్డులు, పెం డింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ విడుదల చేస్తామని ఇచ్చిన హా మీని అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం గతంలో రెండు డీఏలు ప్రకటించి ఒక డీఏను విడుదల చేసి మరోక డీఏను ఆరు నెలల్లో విడు దల చేస్తామని ప్రకటించిందన్నారు. ఆ గడువు కూడా సమీపిస్తున్నదని, డిసెంబర్‌లో మిగిలిన ఒక డీఏను ప్రకటించాల న్నారు. ఈ డీఏ ఇచ్చినా ఇంకా నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటాయని, జనవరి వస్తే మరోక డీఏ కలిపి మొత్తంగా ఆరు డీఏలు అవుతున్నాయన్నారు.
ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన 64 హామీల మేరకు... జూన్ 13న విడుదల చేసిన జీవో78 ప్రకారం పెండింగ్‌లో ఉన్న డీఏ ను ప్రజాపాలన సంబురాలకు ముందే విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ ప్రకటించినట్లుగా డిసెంబర్‌లో ఒక డీఏను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో జేఏసీ నేతలు పుల్గం దామోదర్ రెడ్డి, వెంకట్, సదానంద్ గౌడ్, వంగ రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ముజీబ్ హుస్సేన్, ఎ. సత్యనారాయణ, వెంకట్, దామోదర్ రెడ్డి, తిప్పర్తి యాద య్య, లింగారెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, దాస్య నాయక్, అనిల్‌కుమార్, బి. శ్యామ్, కృష్ణయాదవ్, రామారావు పాల్గొన్నారు.