calender_icon.png 2 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేమేం పాపం చేశాం!

02-12-2025 01:35:37 AM

-ప్రైవేటు ఉద్యోగులు

-జీరో ప్రీమియంతో రూ. 1.25 కోట్ల ప్రమాద బీమాపై ఆవేదన

-అందరినీ ఆలోచించేలా చేసిన ‘విజయక్రాంతి’ కథనం

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ప్రమాద బీమా.. అం టే వేల, లక్షల్లో ఉన్న ప్రైవేటు ఉద్యోగులకు కొంత ఇబ్బందికరమే. ప్రీ మియం చెల్లిస్తేనే బీమా సౌకర్యం ఉంటుంది. ఏదైనాప్రమాదం జరిగినప్పుడు కుటుంబం రోడ్డున పడ కుండా కాపాడుతుందనే నమ్మకంతో ప్రమాద బీమాను ఎంచు కుంటారు.

కానీ రూ.1.25కోట్ల ప్రమాద బీమా అంటే మాత్రం.. ప్రైవేటు కంపెనీలు, వ్యాపార, వాణి జ్య సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికికూడా అందని ద్రాక్షలాగే చెప్పు కోవచ్చు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, ఆయా శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి ఉచితంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమాను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) చర్యలు తీసు కుంటున్న నేపథ్యంలో ప్రైవేటు రం గంలోని ఉద్యోగులు ఏం పాపం చేశారని  ప్రశ్నిస్తున్నారు.

ప్ర భుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉ ద్యోగులకు జీరో ప్రీమియంతో రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం గు రించి సోమవారం ‘విజయక్రాంతి’ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రభుత్వ వర్గాలతోపాటు.. ప్రైవేటు ఉద్యోగ వర్గంలోనూ సంచలనం సృష్టించింది. ఈ కథనాన్ని చదివిన ప్రతి ప్రైవేటు ఉద్యోగికూ డా దీనిని తమకు ఎందుకు అ మలు చేయరని అనుకుంటున్నారు.

మాకూ అమలు చేయాలి..

సింగరేణి సంస్థలో సీఎండీ బలరామ్ చొరవతో ప్రారంభమైన రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని చూసి.. కోల్ ఇండియాలో.. ఆపై నైవేలీ లిగ్నైట్‌లో.. తర్వాత ఇతర ప్రభుత్వ రంగ సం స్థల్లో అమలవుతున్న విషయాన్ని నీతి ఆయోగ్‌ద్వారా తెలుసుకున్న ప్రధాన మంత్రి కార్యాలయం.. దేశ వ్యాప్తంగా ఈ ప్రమాద బీమా పథకాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రా లకు సీఎస్‌లకు సూచిస్తూ.. సర్క్యులర్ జారీచేసింది.

ఈ పథకంలోకి రావాలంటూ ప్రతి సంస్థతోనూ బ్యాంకరు ఒప్పందం చేసుకోవాలి. కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. దీని తో పూర్తి ఉచితంగా..ఒక్క పైసా చెల్లించకుండానే సదరు ఉద్యోగికి రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని ఆయా బ్యాంకర్లు కల్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని సోమ వారం ‘విజయక్రాంతి’ దినపత్రిక తన కథనంలో తెలిపింది. 

ఈ వినూత్న బీమా పథకం గురించి తెలుసుకున్న ప్రైవేటు సం స్థల ఉద్యోగులు, కార్మికులుకూడా ఈ పథకాన్ని మాకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని చర్చించుకోవడం గమనార్హం.

ఈ వినూత్న పథకాన్ని మొదలుపెట్టిన సింగరేణికి అభినందనలు తెలుపుతూనే.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 10 శాతంకూడా లేరని.. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకుకూడా ఈ పథకాన్ని అమలు చేసే లా పీఎంకార్యాలయం చొరవ తీ సుకుని, ప్రైవేటు కంపెనీలు, సంస్థలకు ఆదేశాలు జారీచేయాలని డి మాండ్ చేస్తున్నారు.

ఇందుకు సం బంధించి కేంద్రమే నేరుగా కార్మిక శాఖ, ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిస్తూ.. ప్రైవేటు సంస్థలన్నీకూడా తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేయాలని, అందుకు అనుగుణగా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ప్రతి ఉద్యోగి, కార్మికునికి కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద అకౌంట్ తీసుకునేలా చూడాలని, తద్వారా ప్రైవేటు రంగంలోకి ప్రతి ఉద్యోగి, కార్మికుడుకూడా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా పథకంలోకి చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని పలువురు ప్రైవేటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులుకూ డా డిమాండ్ చేయడం గమనార్హం.

బీమా అందరికీ ఇవ్వాల్సిందే: 

కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈ బీమాను అమలు చేయడం సంతోషించదగ్గ విషయమే. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా దీన్ని అమలు చేయాలి. దేశ్యవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి ప్రైవేట్ విద్యారంగం, ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ బీమా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

దీన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి బీమా సౌకర్యం కల్పించాలి. జీరో ప్రీమియంతో రూ.1.25 కోట్లు బీమాను అమలు చేయడం ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయి. ఈ బీమా ఇవ్వడం భారం కాదు కాబట్టి. అవసరమైతే చట్టం చేసైనా అన్ని సంస్థలు అమలు చేయాలి. బతుకు భరోసా కోసం బీమా ఇవ్వడమనేది న్యాయమైనది. ప్రైవేట్‌లోనూ దీన్ని అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

 ఏ.విజయ్ కుమార్, టీపీటీఎల్‌ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు