02-12-2025 12:27:00 AM
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్1, (విజయక్రాంతి):డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కె టింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలిం చారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌ లిక సదుపాయాలు, విభాగాల ఏర్పాట్లు, ఆతిథ్య సదుపాయాలు, భద్రత, సభాస్థలి ఏ ర్పాట్లు, రవాణా నిర్వహణ వంటి అంశాల ను శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
మంగళవారం జరగనున్న ప్రా రంభోత్సవం సందర్భంగా ఏ లోపం ఉండకుండా సమన్వయంతో పనిచేయాలని సంబంధిత విభాగాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.దేశంలోనే తొలి పూర్తిస్థాయి భూవిజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయంగా అవతరించబోయే ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏ ర్పాట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పర్యవేక్షణలో పూర్తయ్యాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ అధికారికంగా ప్రజలకు అం కితం కానుంది. మౌలిక సదుపాయాలతో ప్రకాశవంతంగా తీర్చిదిద్దిన యూనివర్సిటీ ప్రాంగణం ప్రాంతీయ గౌరవాన్ని మరింత పెంచింది. కొత్తగూడెం ప్రాంతం విస్తారంగా కలిగిన బొగ్గు గనులు, ఖనిజ వనరులు, భూ మి అంతర్గత నిర్మాణాలకు సంబంధించిన విశిష్టతల నేపథ్యంలో, గతంలో స్థాపించబడిన మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీని ఆధునిక భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చ డం రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.
ఈ విద్యాసంస్థ ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులతో పాటు దేశమంతటా ఉన్న విద్యార్థుల కు అత్యున్నత శాస్త్రీయ పరిశోధనా అవకాశాలను అందించనుంది. జియాలజీ, జియోఫిజి క్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి కీలక విభాగాలతో కూడిన ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి. వీటి ద్వారా ఖనిజ అన్వేషణ, భూకంప శా స్త్రం, హైడ్రోజియాలజీ, జలవనరుల నిర్వహణ, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిర క్షణ వంటి రంగాల్లో విద్యార్థులు ప్రామాణిక జ్ఞానం, ఆధునిక పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభించనుంది .
కోల్ మైన్స్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం ప్రాంత ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భూకంప విశ్లేష ణ, వరదల అధ్యయనం, భూగర్భ జలాల పరిశోధన, ఖనిజ సంపద అన్వేషణకు శాస్త్రీ య వేదికగా ఈ విశ్వవిద్యాలయం నిలవనుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూవిజ్ఞానశాస్త్ర విశ్వవిద్యా లయం స్థాపన తెలంగాణ విద్యా రంగంలో చారిత్రాత్మక ఘట్టం అన్నారు. ఈ ప్రాంత భౌగోళిక ప్రత్యేకతలు, ఖనిజ సంపద, పర్యావరణ వైవిధ్యం భూవిజ్ఞాన రంగానికి అ మూల్యమైన వనరు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు శాస్త్రీ య ప్రపంచంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది అని తెలిపారు. భూగర్భ జలాలు, ఖనిజ సంపద నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల కు నిపుణులను తీర్చిదిద్దడంలో ఈ వర్సిటీ కేంద్ర పాత్ర పోషిస్తుంది అని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ శాస్త్రీయ అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని రాసే చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని మం త్రి తెలిపారు. రేపటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క రూ విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ పరిశీలన లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.