calender_icon.png 31 January, 2026 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్సీని అమలు చేయండి

31-01-2026 01:38:50 AM

  1. పెండింగ్ బిల్లులు ఇవ్వండి
  2. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి టీఎన్జీవో నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్‌ఎం హుస్సేని ముజీబ్ కోరారు. శుక్రవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను టీఎన్జీవో నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈహెచ్‌ఎస్ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు, బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ స్కీంను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, నాయకులు ఖాదిర్ బిన్ హసన్, గడ్డం జ్ఞానేశ్వర్ ఉన్నారు.