31-01-2026 01:37:11 AM
మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనం చేసి 010 పద్దు ద్వారా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్‌ఫెడరేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేసింది. శుక్ర వారం హైదరాబాద్‌లోని టీఎస్ యూటీఎఫ్ భవన్‌లో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శు లు బీ కొండయ్య, డాక్టర్ సిల్వేరు మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫెడరేషన్ క్యాలెండర్‌ను యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవి ఆవిష్క రించారు. టీజీటీలకు, జూలై 2013లో జాయిన్ అయిన పీజీటీలకు నోషనల్ సర్వీస్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏ వెంకట్, క్రాంతికుమార్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.