13-01-2026 12:01:32 AM
గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ
అశ్వారావుపేట, జనవరి 12 (విజయ క్రాంతి) : అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి, కోయ రంగాపురం గ్రామ పంచాయతీలు మినహా ఇతర గ్రామ పంచాయతీల వారు పెద్ద వాగు ప్రాజెక్ట్ వాగులో ఇసుకకు రావద్దని సూచిస్తున్నారు. సోమవారం గుమ్మడవల్లి సర్పంచ్ పాయం శ్రీదేవి, కోయ రంగాపురం పంచాయతీ సర్పంచ్ సోడెం చిన్న గంగమ్మ ఇద్దరు గ్రామ పెద్దలతో కలసి వాగు నీ పరిశీలించారు. రెండు పంచాయతీల్లో అభివృద్ధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర భవనాలు మంజూరి అయి ఉన్నాయని వాగులో ఇసుక రెండు పంచాయతీ లకు సరిపోతుందని, అందుకే ఇతరులు ఇసుక తొలకాలకు అంగీకరించడం లేదని తెలిపారు. ఇసుక తవ్వడం వల్ల వాగు లో నీరు ఇంకిపోతుందని అన్నారు. తద్వారా బోర్లు వేస్తే నీరు అందటం లేదు అన్నారు. దయచేసి ఇతర పంచాయతీల నుండి ఇసుక కోసం ఎవ్వరు రావద్దని కోరారు.