calender_icon.png 9 August, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్మ సామాజిక వర్గానికి పార్టీలు స్థానం కల్పించాలి

09-08-2025 03:02:13 AM

తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక 

ఖైరతాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంలో ఐదు శాతానికి పైగా జనాభా కలిగిన కమ్మ సామాజిక వర్గానికి రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల అధినాయకులకు కలిసి వినతి పత్రాలు అందజేయమన్నట్లు తెలిపారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు విద్యాసాగర్, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, వివిఎస్‌ఎన్ చౌదరిలు మాట్లాడారు.. తెలంగాణ రాష్ర్టంలో విద్య, వ్యవసాయం, రాజకీయం, సామాజిక రంగాలలో పాటు సేవారంగంలో కూడా కమ్మ సామాజిక వర్గం ముందుందని అన్నారు. అంతేకాకుండా  మిగతా సామాజిక వర్గాల ప్రజల ఎదుగుదలకు కూడా తోడ్పడుతున్నారని తెలిపారు.

జజూబ్లీహిల్స్‌లో అన్ని రాజకీయ పార్టీలు కమ్మలకే సీటు ఇవ్వాలి 

కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్ మరణించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికలో అన్ని రాజకీయ పార్టీలు కమ్మలకే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో 119 ని యోజకవర్గాల్లో 35 నియోజకవర్గంలో  కమ్మ సా మాజిక వర్గం దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఉంది అని అన్నారు. పార్టీలు కమ్మ కులస్తులకు సీట్లు కేటాయిస్తే ముందుండి వారిని గెలిపించుకుంటామన్నారు.