calender_icon.png 2 May, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడికి నిరసనగా

25-04-2025 12:44:27 AM

చేగుంట, ఏప్రిల్ 24 : చేగుంట మండల కేంద్రంలో బిజెపి నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి, జాతీయ జెండాలు, బిజెపి జండాలు పట్టుకుని నిరసన తెలిపారు. పట్టణ కేంద్రంలో పాకిస్తాన్ కు  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పహిల్గాం మృతులకు సంతాపం తెలిపి, ఉగ్ర దాడిని  తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి నర్సిములు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం గణేష్ రవికుమార్, అసెంబ్లీ కో కన్వీనర్ గోవిందు, టెలికాం బోర్డు మెంబర్ బాలచందర్, బీజేవైఎం మండల అధ్యక్షులు  శేఖర్ గౌడ్,గొల్లపల్లి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రఘువీర్ రావు, హరి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత, మండల మహిళా అధ్యక్షురాలు లావణ్య, కావేటి వెంకటేష్, జుకంటి శోభన్, నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.