25-04-2025 12:44:54 AM
కరీంనగర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా రామడుగు మండలం వెదిరలోని అల్ఫోర్స్ హై స్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8వ, 9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్టడీ మెటీరియల్, పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు 21 రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. మొదటి దశలో 350 మంది విద్యార్థులో 80 మంది విద్యార్థులు ఎంపికైనరని, ఆ ఎంపికైన వారికి రెండో దశ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.