23-09-2025 12:12:04 AM
సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టుల్ వేరే లెవల్. అందుకే రామ్‌గోపాల్‌వర్మ కూడా ఫ్యాన్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్‌తో రూపొందిస్తున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలేర్పడా నికి కారణమూ అదే. డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసిన సందీప్‌రెడ్డి నిర్మాణంలోనూ కొత్తగా ఆలోచిస్తున్నారు.
తన నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌తో యువతకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. తన సొంత బ్యానర్‌లో రూపొం దనున్న తొలి చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు వేణును దర్శకుడిగా ఎంచుకున్నాడట. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో యూత్ ఫుల్ కంటెంట్‌తో రానున్న ఈ సినిమాలో ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.