23-09-2025 12:13:40 AM
2014లో ‘మర్దానీ’, 2019లో ‘మర్దానీ2’ ఎంతటి విజయాలను నమోదు చేశాయో సినీప్రియులకు చెప్పక్కర్లేదు. ఈ ఐకానిక్ ఉమెన్-కాప్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న చిత్రమే ‘మర్దానీ3’. ఇందులో తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో మరోసారి కనిపించనున్నారు రాణి ముఖర్జీ. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శరన్నవరాత్రోవ్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి పోస్టర్‌ను విడుదల చేసింది. మంచికి, చెడుకు జరిగే పోరాటాల్ని ఈ సినిమాలో చూపించ నున్నారు. మహిషాసురమర్దిని శక్తిని తెలిపే ‘అయిగిరి నందిని’ శ్లోకంతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ఓ కేసును పరిష్కరించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో చెప్పకనే చెబుతోందీ పోస్టర్. ఈ సినిమా 2026న ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది.