calender_icon.png 7 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లండన్‌లో విగ్రహం రూపంలో..

06-12-2025 12:19:44 AM

బాలీవుడ్ స్టార్స్ షారూఖ్‌ఖాన్, కాజోల్ కంచు విగ్రహాన్ని లండన్ లీసెస్టర్ స్క్వేర్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’ సినిమా భారతీయ చిత్రపరివ్రమలో అత్యంత ఆదరణ పొందింది. ఈ సినిమాలో రాజ్, సిమ్రాన్ పాత్రలను పోషించినందుకు తమ పాత్రలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని విగ్రహావిష్కరణ సందర్భంగా నాయకానాయికలు షారూఖ్‌ఖాన్, కాజోల్ పేర్కొన్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్సరాలను పూర్తి చేసుకున్న ఈ మూవీలోని రాజ్, సిమ్రాన్ పాత్రలకు సంబంధించి ఐకానిక్ స్టిల్‌ను కాంస్య విగ్రహంగా రూపొందించారు. లండన్ లీసెస్టర్‌లో విగ్రహ రూపంలో ఆవిష్కరింపబడిన తొలి ఇండియన్ సినిమా ఇదే.

హ్యారీ పోటర్, మేరి పాపిన్స్ ప్యాడింగ్టన్, సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి చార్మిత్రాత్మక చిత్రాల్లోని ప్రముఖ పాత్రలతోపాటు బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్ వంటి వాటి సరసన ఇప్పుడీ విగ్రహం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారూఖ్‌ఖాన్‌తోపాటు కాజోల్, యష్‌రాజ్ ఫిల్మ్స్ సీఈవో అక్షయే విదానీ, హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాస్ మోర్గన్ హాజరయ్యారు.