calender_icon.png 7 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ నచ్చేలా సైక్ సిద్ధార్థ

06-12-2025 12:18:33 AM

యంగ్ హీరో శ్రీనందు నటిస్తున్న తాజాచిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి నిర్మించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.

డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ధుమ్ ఠకుమ్ పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత సురేశ్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో సురేశ్‌బాబు మాట్లాడుతూ.. “పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి సినిమా ఇదే అనిపించింది” అన్నారు. హీరో శ్రీనందు మాట్లాడుతూ.. “ఈ సాంగ్ నా లైఫ్‌కి చాలా దగ్గర పోలిక ఉంది. ఈ సాంగ్ లిరిక్ కాసర్ల శ్యామ్ రాశారు. బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. కే రాఘవేంద్రరావుకి షో వేసినప్పుడు నాకు చెమటలు పట్టేసాయి.

లెజెండరీ రాఘవేంద్రరావు మాతో మూడు గంటల టైమ్ స్పెండ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం” అన్నారు. హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ.. “రామానాయుడు స్టూడియోలో మా సినిమా పోస్టర్ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది మాకు చాలా గొప్ప విషయం. టీజర్ తర్వాత ట్రైలర్ కి పదింతలు ఎనర్జీ వచ్చింది. సినిమా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి, మూవీ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.