calender_icon.png 24 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ జీఐసీ

24-10-2025 12:46:01 AM

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సంస్థ ప్రతినిధులు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాం తి): అమెరికా విమానయాన దిగ్గజ సంస్థ సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ (జీఐసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ ఉడ్స్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టామ్ మెరిట్, లీగల్ కౌన్సిల్ హెడ్ జేసన్ షయింగ్, హెక్స్ అడ్వయిజరీ గ్రూప్‌కు చెందిన సార్థక్ బ్రహ్మ పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ యించిన సౌత్‌వెస్ట్ నాయకత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తూ అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధిని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. రాష్ట్రం కోసం ప్రభుత్వం రూపొం దించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ ప్రణాళికలో భాగంగా 2034 నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేలా లక్ష్యాన్ని నిర్దేంచుకున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ.అజిత్‌రెడ్డి హాజరయ్యారు.