calender_icon.png 24 October, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో సంసద్ ఖేల్ అభియాన్ క్రీడలు

24-10-2025 12:45:56 AM

యాప్‌ను ప్రారంభించిన ఎంపీ  గోడం నగేష్ 

ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాం తి):  జిల్లాలోని విద్యార్థులు,యువతను క్రీడ ల పట్ల ఆకర్షితులను చేసేందుకు సంసద్ ఖేల్ అభియాన్ క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు ఎంపీ  గోడం నగేష్ తెలిపా రు. గురువారం ఆదిలాబాద్ లోని ఆయన నివాసంలో క్రీడా పోటీల నమోదు యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నియోజకవర్గాల్లోని యువతి యువకులు విద్యార్థులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.

నవంబర్ చివరి వారంలో నియోజకవర్గ స్థాయి పోటీలు ఉంటాయని పేర్కొ న్నారు. డిసెంబర్ మూడో వారంలో పార్లమెంట్ స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.  కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, హాకీ తదితర క్రీడాంశాలలో పోటీలు ఉంటాయని తెలిపారు.

విజేతలకు బహుమతులు ప్రశంసపత్రాలు అందజేస్తామని పేర్కొన్నా రు.  జిల్లాలోని యువతి యువకులు విద్యార్థులు తమ ఎంట్రీలను ఈనెల ౨౪వ తేదీ నుంచి నవంబర్ ౧౦, 2025 వరకు http:// sansadkhelmahotsav.in ద్వారా నమో దు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా గిరిజన క్రీడాధికారి కె పార్థసారథి, డివైస్‌ఓ జక్కుల శ్రీనివాస్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె రాష్ట్రపాల్, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ రామేశ్వర్, పేట కార్యదర్శి జె. సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.