05-07-2025 07:54:53 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలల్లో విత్తన సేకరణ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా మండలంలోని మొరంపల్లి బంజర్ కాంప్లెక్స్ స్థాయి పాఠశాలలో జరిగిన విత్తన సేకరణ పోటీలో ఎంపీపీఎస్ పోలవరం పాఠశాల విద్యార్థులు విశేషంగా రాణించి మొదటి బహుమతి అందుకున్నారు. వారు సేకరించిన వివిధ రకాల స్థానిక విత్తనాల నాణ్యత,పరిమాణం,శ్రేణీకరణలో చూపిన ప్రతిభకు ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ ఆదినారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా ని, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు