calender_icon.png 19 July, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల

19-07-2025 12:42:19 AM

ఖమ్మం,(విజయక్రాంతి): నగరంలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు.

ఇందులో వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, థీమాటిక్ గార్డెన్లు, విశ్రాంతి మండపాలు, చైన్ లింక్ ఫెన్సింగ్, కార్తీక వన భోజనం డైనింగ్ హాల్, పార్క్ సందర్శకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భోజన హాల్, కమ్యూనిటీ కిచెన్ సమూహ సమావేశాలు, సామాజిక కార్యక్రమాల కోసం నూతనంగా నిర్మించిన వంటగది, అటవీ మంటలు, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు ట్రాక్టర్ విత్ వాటర్ టాంకర్, బ్యాటరీ ద్వారా నడిచే చెత్త తొలగింపు వాహనం, పార్క్ పరిసరాల్లో పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ అందించిన ప్రత్యేక వాహనంలు ఉన్నాయి.

ఈ అభివృద్ధి పనులు హరిత నిధి, మున్సిపల్ నిధులతో చేపట్టబడుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.  ఖమ్మం నగరం నగర హరితవనం అభివృద్ధి, పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా ఎదుగుతోందన్నారు.ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా "ఒక మొక్క అమ్మ పేరు మీద" అనే అంశంపై భారీ స్థాయిలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం మంత్రి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.